Homeఫ్లాష్ ఫ్లాష్T20 World Cup: చరిత్రకు మరో అడుగు దూరం.. దశాబ్దపు రికార్డు బ్రేక్!

T20 World Cup: చరిత్రకు మరో అడుగు దూరం.. దశాబ్దపు రికార్డు బ్రేక్!

టీ20 వరల్డ్ కప్‌ టోర్నీలో ఓటమే లేకుండా టీమిండియా ఫైనల్‌కు చేరుకుంది. వన్డే వరల్డ్ కప్-2023 చేజారడంతో ఇప్పుడు టీ20 ప్రపంచకప్ సాధించాలని భారత్ పట్టుదలతో ఉంది. ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి టైటిల్ చేజిక్కించుకోవాలని యోచిస్తోంది. మరోవైపు దక్షిణాఫ్రికా జట్టు కూడా టోర్నీలో ఓటమే లేకుండా ఫైనల్‌కు చేరుకోవడం విశేషం. గయానా వేదికగా గురువారం డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో టీమిండియా 68 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది.
అయితే ఈ క్రమంలో భారత్ పలు రికార్డులు బ్రేక్ చేసింది. 2014 టీ20 వరల్డ్ కప్‌ అనంతరం నాకౌట్ మ్యాచ్‌ల్లో డిఫెండ్ చేసి గెలిచిన జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. 2014 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్‌‌లో శ్రీలంక లక్ష్యాన్ని కాపాడుకుని ఫైనల్‌కు చేరింది. డక్‌వర్త్‌లూయిస్ పద్ధతిలో వెస్టిండీస్‌పై లంక 27 పరుగుల తేడాతో గెలిచింది. ఆ తర్వాత నుంచి పొట్టి కప్‌లో నాకౌట్ గేమ్స్‌లో ఏ జట్టు లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. అనంతరం 12 సార్లు ఛేజింగ్ చేసిన టీమే గెలిచింది. కానీ ఇంగ్లండ్‌తో జరిగిన సెమీస్‌లో భారత్ 172 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకుని విజయతీరాలకు చేరింది.

Recent

- Advertisment -spot_img