Homeహైదరాబాద్latest NewsT20 World Cup: కొంపముంచిన అఫ్గానిస్థాన్.. పాపం.. టోర్నీ నుంచి న్యూజిలాండ్ ఔట్..!

T20 World Cup: కొంపముంచిన అఫ్గానిస్థాన్.. పాపం.. టోర్నీ నుంచి న్యూజిలాండ్ ఔట్..!

టీ20 వరల్డ్ కప్‌లో సూపర్-8కు చేరాలనుకున్న న్యూజిలాండ్ ఆశలు ఆవిరి అయ్యాయి. అఫ్గానిస్థాన్ విజయం సాధించడంతో కివీస్ అధికారంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. లీగ్ స్టేజ్‌‌లోనే ఇంటిముఖం పట్టింది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో మొదటి రౌండ్‌లోనే వెనుదిరడం న్యూజిలాండ్‌కు ఇదే తొలిసారి. గ్రూప్-సీ నుంచి అఫ్గానిస్థాన్, వెస్టిండీస్ తదుపరి దశకు అర్హత సాధించాయి.
అయితే ఈ విజయంతో ఆఫ్ఘనిస్థాన్ ఖాతాలో ఆరు పాయింట్లు చేరాయి. టేబుల్ టాపర్‌గా నిలిచింది. వెస్టిండీస్ కూడా ఆరు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఇరు జట్లు ఆడిన మూడింట్లో నెగ్గాయి. మరోవైపు న్యూజిలాండ్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. పాయింట్ల ఖాతా తెరవలేదు. -2.425 ప్రతికూల రన్ రేట్‌తో పట్టికలో దిగువన ఉన్నారు. శుక్రవారం ఉగాండాతో, సోమవారం పపువా న్యూ గినియాతో కివీస్ తలపడనుంది.

Recent

- Advertisment -spot_img