జూన్ 2న నుంచి టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీకి అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. గ్రూప్ దశ మ్యాచ్‌ల వరకు యూఎస్‌ఏలో, మిగిలిన అన్ని మ్యాచ్‌లు మరియు వెస్టిండీస్ జరుగుతాయి. అయితే ప్రపంచకప్ ప్రారంభం కాకముందే భారత అభిమానుల్లో ప్రపంచకప్ సందడి మొదలైంది. ఐతే ఇప్పుడు ప్రపంచకప్ భారత జట్టుకు ఏ ఆటగాళ్లను ఎంపిక చేస్తారన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. దాదాపు పది మంది ఆటగాళ్లను ఖరారు చేసినప్పటికీ, మిగిలిన ఐదు స్థానాల కోసం ఆటగాళ్ల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్టర్ల బృందం టీమ్ ఇండియా ఎంపికపై నిర్ణయాలు తీసుకుంటుందని తెలుస్తుంది.
మరోవైపు, బీసీసీఐ భారత జట్టును ప్రకటించకముందే, మాజీ ఆటగాళ్లు తమ అంచనాల తో కూడిన 15 మంది సభ్యులను టీమ్ ను ఎంపిక చేస్తున్నారు. తాజాగా ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ కూడా ఈ జాబితాలో చేరారు. అయితే అతను ఎంపిక చేసిన జట్టులో విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా లేకపోవడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. ఈ సీజన్‌లో వెలుగులోకి వచ్చిన కేకేఆర్ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా మరియు లక్నో సూపర్‌జెయింట్స్ స్పీడ్ గన్ మయాంక్ యాదవ్‌లకు మంజ్రేకర్ తన టీంలో అవకాశం ఇచ్చాడు. అలాగే, శుభ్‌మాన్ గిల్‌కు మొండిచేయి చూపాడు. బ్యాకప్ ఓపెనర్/బ్యాకప్ వికెట్ కీపర్‌గా సంజు శాంసన్ మరియు కేఎల్ రాహుల్‌లను ఎంపిక చేశాడు. అలాగే విధ్వంసకర బ్యాట్స్‌మెన్ శివమ్ దుబే, రింకూ సింగ్‌లను మంజ్రేకర్ ఎంపిక చేయకపోవడం కూడా గమనార్హం. ఈ వ్యాఖ్యాత ఎంపిక చేసిన జట్టులో రవీంద్ర జడేజా, కృనాల్ పాండ్యా మాత్రమే ఆల్ రౌండర్లు గా ఉన్నారు.
మంజ్రేకర్ ఎంపిక చేసిన టీమిండియా:
రోహిత్ శర్మ, యశస్వీ జైస్వాల్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, కుల్‌దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అవేశ్ ఖాన్, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్, కృనాల్ పాండ్య.