Homeఫ్లాష్ ఫ్లాష్T20 World Cup: టీ20 ఫార్మాట్ నుండి రోహిత్ శర్మ రిటైర్మెంట్..!

T20 World Cup: టీ20 ఫార్మాట్ నుండి రోహిత్ శర్మ రిటైర్మెంట్..!

టీ20 ప్రపంచ కప్ 2024 తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ తరువాత భవిష్యత్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యాను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రపంచకప్‌కు ఎంపిక చేసిన జట్టులో హార్దిక్‌కు చోటు కల్పించాలని బీసీసీఐ సెలక్టర్ల పై ప్రత్యేక ఒత్తిడి తెచ్చినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే రోహిత్ రిటైర్మెంట్ గురించి జాతీయ మీడియాలో పలు కథనాలు వస్తున్నాయి. రోహిత్ టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలుకుతాడు. మరికొద్ది రోజుల్లో టీ20 ప్రపంచకప్ తర్వాత హిట్ మ్యాన్ ఈ నిర్ణయం ప్రకటించనున్నాడని తెలుస్తోంది.
అయితే 2022 ప్రపంచకప్ తర్వాత రోహిత్ మూడు టీ20లు మాత్రమే ఆడాడు. అందులో రెండు సార్లు డకౌటయ్యాడు. ఓ సెంచరీ సాధించాడు. అయితే టీ20 ప్రపంచకప్ కోసం ప్రకటించిన భారత జట్టులో హార్దిక్ పాండ్యా ఎంపికపై కెప్టెన్ రోహిత్, టీమ్ ఇండియా సెలక్టర్లు జోక్యం చేసుకోలేదని తెలుస్తుంది. అయితే హార్దిక్ తప్పనిసరిగా జట్టులో ఉండాలంటూ బీసీసీఐ నుంచి సెలక్టర్లపై ప్రత్యేక ఒత్తిడి తెచ్చిందని వార్తలు వస్తున్నాయి. భవిష్యత్‌లో ఆల్‌రౌండర్‌కు భారత జట్టు కెప్టెన్సీ ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఫామ్ లో లేకపోయినా హార్దిక్ కు ఛాన్స్ దక్కిందని వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాదు టీ20 ప్రపంచ కప్ జుట్టు వైస్ కెప్టెన్ గా హార్దిక్ ఎంపికయ్యాడు. వైస్ కెప్టెన్ పదవికి బుమ్రా నుంచి హార్దిక్ గట్టి పోటీని ఎదుర్కొన్నాడు. కానీ కాబోయే కెప్టెన్ గా ఎంపిక కానున్న హార్దిక్ ను వైస్ కెప్టెన్ గా ప్రకటించారని చెప్పొచ్చు.

Recent

- Advertisment -spot_img