క్రికెట్ అభిమానులను అలరించడానికి టీ20 ప్రపంచకప్ టోర్నీ సిద్ధమైంది. జూన్ 2 నుంచి యూఎస్ఏ- వెస్టిండీస్ సంయుక్త ఆతిథ్యంలో టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. అయితే ఇప్పటి వరకు జరిగిన టీ20 వరల్డ్ కప్ లో ఏ దేశానికి ఎన్ని ట్రోఫీలు సాధించిందో ఇప్పుడు తెలుసుకుందాం… అయితే ఐసీసీ టీ20 ప్రపంచకప్ ట్రోఫీని రెండుసార్లు గెలుచుకున్న జట్లుగా వెస్టిండీస్, ఇంగ్లాండ్ నిలిచాయి. అయితే 50 ఓవర్ల క్రికెట్ ప్రపంచకప్ ట్రోఫీని ఆరుసార్లు గెలిచిన ఆస్ట్రేలియా మాత్రం ఒక్కసారి మాత్రమే టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుంది. ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక కూడా ఒక్కసారి మాత్రమే టీ20 ప్రపంచకప్ ట్రోఫీని గెలుచుకున్నాయి. 2016లో భారత్ ఆతిథ్యం ఇచ్చినప్పుడు వెస్టిండీస్ రెండవ ప్రపంచకప్ ట్రోఫీ గెలుచుకుంది. అయితే ఇప్పటివరకు ఎనిమిది టీ20 వరల్డ్ కప్ టోర్నీలు జరిగాయి. అయితే ఒక్కసారి కూడా డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన జట్టు మళ్లీ విజేతగా నిలవలేదు. దీంతో ఈసారి జరిగే టీ20 ప్రపంచకప్‌లో ఏమవుతుందనేది చూడాలి.