Bollywood beauty queens Taapsee and Kangana Ranaut are fight regularly. The two have been in the news frequently, blaming each other.
War has recently erupted as a Twitter platform between the two over the issue of farmers’ protests.
బాలీవుడ్ అందాల భామలు తాప్సీ, కంగనా రనౌత్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది.
వీరిద్దరు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ తరచూ వార్తలలో నిలుస్తూ ఉన్నారు.
తాజాగా రైతుల నిరసనల విషయంలో ఇద్దరి మధ్య ట్విట్టర్ వేదికగా వార్ నడిచింది.
అంతార్జాతీయ పాప్ సింగర్ రెహాన్నే రైతుల నిరసనకు మద్దతు తెలియజేస్తూ.. దీనిపై మనం ఎందుకు మాట్లాడకూడదు అని ట్వీట్ చేసింది.
దీనిపై స్పందించిన కంగనా.. అవగాహన లేనప్పుడు మాట్లాడడం ఎందుకంటూ కౌంటర్ వేసింది.
అయితే రెహాన్నేకు తాప్సీ మద్దతుగా నిలిచిన తాప్సీ.. ఒక ట్వీట్ ఐక్యతను దెబ్బతీస్తూ, జోక్ విశ్వాసాన్ని కదలించింది.
మీ విలువలను, వ్యవస్థలను బలపరిచేందుకు మీ పని మీరు చేయాల్సి ఉంటుంది తప్ప ఇతరులకు పాఠాలు నేర్చించడానికి టీచర్‌గా మారొద్దు అంటూ ట్వీట్ చేసింది.
దీనిపై స్పందించిన కంగనా.. బీ గ్రేడ్ మనుషులకు బీ గ్రేడ్ ఆలోచనలే వస్తాయి. మాతృభూమి, కుటుంబం కోసం నిలబడగాలి.
కర్మ లేక ధర్మమో తెలియదు కాని ఉచిత సలహాలను వినకండి. వాటి వలన దేశానికి ఉపయోగపడదు.
అందుకే వారిని బీ గ్రేడ్ అని పిలుస్తాను అని ట్వీట్ చేసింది.
వీరిద్దరి ట్వీట్స్‌ని స్క్రీన్ షాట్ తీసి షేర్ చేసిన నెటిజన్.. తాప్సీ ట్వీట్ ఒకరిని నిజంగానే కదిలించినట్టుంది.
ఇవి విషపూరితంగా, వివాదాస్పదంగా లేకపోతే సరదాగా ఉండేది అంటూ రీ ట్వీట్ చేశాడు.
దీనిపై స్పందించిన తాప్సీ.. విషం వారి డీఎన్ఏలోనే ఉండొచ్చు లేదా ఆర్ఎన్ఏ.. ప్లేట్‌లెట్స్‌పై కూడా అంటూ తాప్సీ పేర్కొంది.
మొత్తానికి కంగనా, తాప్సీ మధ్య వివాదం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.