Homeహైదరాబాద్latest NewsTabu: 12 ఏళ్ల తర్వాత తిరిగి హాలీవుడ్ లోకి స్టార్ హీరోయిన్..!

Tabu: 12 ఏళ్ల తర్వాత తిరిగి హాలీవుడ్ లోకి స్టార్ హీరోయిన్..!

బాలీవుడ్ మరియు టాలీవుడ్‌లో అనేక హిట్ సినిమాల్లో నటించిన అలనాటి అందాల నటి టబు.. ఇప్పుడు ప్రముఖ మూవీ సిరీస్ ‘డ్యూన్’ నటించబోతోంది. నటి టబు 12 ఏళ్ల తర్వాత తిరిగి హాలీవుడ్ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేశారు. ప్రముఖ మూవీ సిరీస్ ‘డ్యూన్’ పార్ట్-3లో ఆమె నటించనున్నట్లు యూఎస్ మీడియా పేర్కొంది. ఈ కథనం ప్రకారం సినిమాలో టబు కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. డెనిస్ విల్లెనెయువ్ దర్శకత్వంలో వచ్చిన రెండు పార్టులు సూపర్ హిట్‌గా నిలిచాయి. కాగా గతంలో టబు ‘ది నేమ్‌సేక్(2006)’, ‘లైఫ్ ఆఫ్ పై(2012)’ సినిమాల్లో నటించారు.

Recent

- Advertisment -spot_img