Homeహైదరాబాద్latest NewsDCP బారీపై చర్యలు తీసుకోండి

DCP బారీపై చర్యలు తీసుకోండి

– జర్నలిస్టుల నిరసన
– ప్రెస్‌ క్లబ్‌ నుంచి కమిషనరేట్‌ వరకు ర్యాలీ
– సీపీకి వినతి పత్రం

ఇదే నిజం, వరంగల్‌ క్రైం: వరంగల్‌ ఎస్‌ఎన్‌ఎం క్లబ్‌ దగ్గర ఆదివారం జరిగిన రాష్ట్ర మంత్రుల అధికారిక కార్యక్రమం కవరేజ్‌కి వెళ్లిన జర్నలిస్టులపై వరంగల్‌ సెంట్రల్‌ జోన్‌ డీసీపీ ఎంఏ అబ్దుల్‌ బారీ చేసిన అనుచిత వాఖ్యలకు నిరసనగా సోమవారం గ్రేటర్‌ వరంగల్‌ ప్రెస్‌ క్లబ్, జర్నలిస్ట్‌ యూనియన్ల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. గ్రేటర్‌ వరంగల్‌ ప్రెస్‌క్లబ్‌లో జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ప్రెస్‌క్లబ్‌ నుంచి కమిషనరేట్‌ వరకు ర్యాలీగా నిర్వహించారు. కమిషనరేట్‌లో వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝాను కలిసి ఇటివల జర్నలిస్ట్‌లపై జరుగుతున్న దాడులను వివరించారు. మంత్రుల కార్యక్రమాలను కవరేజ్‌ చేసే క్రమంలో కొంత మంది పోలీస్‌ అధికారులు అకారణంగా, అత్యుత్సాహం ప్రదర్శించి జర్నలిస్ట్‌లను నెట్టి వేయడం, దుర్బషలాడం చేస్తున్నారని ఆయనకు విన్నవించారు. సెంట్రల్‌ జోన్‌ డీసీపీ బారీ నుంచి ఇటివల కాలంలో జర్నలిస్టులకు పలుమార్లు చేదు అనుభవం ఎదురైనట్లు వారు వివరించారు. జర్నలిస్ట్‌లను దూషించిన డీసీపీ బారీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేదంటే ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని జర్నలిస్ట్‌ సంఘాల నేతలు సీపీ దష్టికి తీసుకెళ్లారు.

Recent

- Advertisment -spot_img