ఇదే నిజం జగిత్యాల రూరల్: జగిత్యాల పట్టణం పరిసర ప్రాంతాల్లో ఉన్న 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించి ఉచిత కంటి ఆపరేషన్ సద్వినియోగం చేసుకోవాలని లైన్స్ క్లబ్ అధ్యక్షులు తాటిపాముల వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈనెల మొదటి వారంలో టౌన్ హాల్లో కరీంనగర్ లైన్స్ కంటి ఆసుపత్రి నిర్వహించిన ఉచిత కంటి ఆపరేషన్ మెగా శిబిరానికి దాదాపు 500 మంది రాగా, విడతల వారీగా ఆపరేషన్ చేయిస్తుండగా, నేడు నాలుగో 44 మంది ఆపరేషన్ విజయవంతం అయిందని తెలిపారు. ప్రతి ఒక్కరి ఉచిత కంటి ఆపరేషన్ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి, వడ్లగడ్డ శంకర్, కోశాధికారి గుండేటి గంగాధర్, లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.