Talasani : ప్రధాని మోదీ ప్రసంగం చాలా సప్పగుంది
Talasani : నిన్న హైదరాబాద్ లో జరిగిన బీజేపీ బహిరంగసభలో ప్రధాని మోదీ ప్రసంగం చాలా చప్పగా సాగిందని తెలంగాణ మంత్రి రఘురామకృష్ణరాజు అన్నారు.
హైదరాబాద్ అందాలను చూసి మోదీ వెళ్లిపోయారని చెప్పారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు మోదీ సమాధానాలు చెప్పలేదని అన్నారు.
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి మరే రాష్ట్రంలో జరగడం లేదని చెప్పారు.
టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ నేతలు అనవసర విమర్శలు చేస్తున్నారని తలసాని విమర్శించారు.
దేశం నుంచి బీజేపీ తరిమికొట్టాలని చెప్పారు.
నిన్న జరిగిన సభలో నీళ్లు, నిధుల గురించి కేంద్ర అమిత్ షా మాట్లాడారని… రెండ్రోజుల బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో బీజేపీ నేతలు తాగిన నీళ్లు తెలంగాణవి కాదా? అని ప్రశ్నించారు.
హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై జరిగిన అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో తలసాని పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.