మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో నటిస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమాయణం సాగిస్తున్న తమన్నా 2025లో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది. అయితే విజయ్ వర్మతో ఒక సినిమా చేస్తున్న టైమ్ లో తమన్నా విజయ్ వర్మ ప్రేమలో పడ్డారు. ఆ తరువాత ఇద్దరూ ఒకరిపై ఒకరికి ఉన్న ఇష్టాన్ని పబ్లిక్‌గా ఒప్పుకున్నారు. ఈ క్రమంలో హీరోయిన్ తమన్నా మరియు విజయ్ వర్మల వివాహం వచ్చే ఏడాది ప్రారంభంలో జరుగుతుందని మరియు తమన్నా కుటుంబం పెళ్లి పనిలో నిమగ్నమైందని వార్తలు వస్తున్నాయి. దీంతో ప్రస్తుతం చేతిలో ఉన్న అన్ని సినిమాలను పూర్తి చేసుకుని తమన్నా పెళ్లికి సిద్దం కానుంది.