నా యాక్టింగ్ నాకే నచ్చలేదు..
తమన్నా భాటియా..
ఇదేనిజం, సినిమా: తన నటన తనకే నచ్చలేదని నటి తమన్నా భాటియా చెప్పింది. ప్రస్తుతం ఆమె వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీగా గడుపుతోంది. మరికొన్ని రోజుల్లో ‘జైలర్’ సినిమాతో పలకరించడానికి సిద్ధంగా ఉంది. స్టార్ హీరో రజనీకాంత్‌తోకలిసి తమన్నా నటించిన సినిమా ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ.. గతంలో తాను నటించిన ‘సుర’ గురించి చెప్పుకొచ్చింది. ఆ సినిమా ఫ్లాప్‌కు గల కారణాన్ని వివరించింది. తమిళ హీరో విజయ్, తమన్నా కలిసి నటించిన చిత్రం ‘సుర’. ఇందులోని పాటలు ప్రేక్షకాదరణ పొందినప్పటికీ.. సినిమా మాత్రం విజయ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్‌గా నిలిచింది. దీనిపై తమన్నా మాట్లాడుతూ.. ఆ సినిమాలో నటన తనకే నచ్చలేదని తమన్నా చెప్పుకొచ్చింది.
Tamannaah Bhatia:నా యాక్టింగ్ నాకే నచ్చలేదు..
RELATED ARTICLES