Homeహైదరాబాద్latest Newsవివాదంలో చిక్కుకున్న హీరోయిన్ తమన్నా… ఆ కేసులో మిల్కీ బ్యూటీని విచారించిన అధికారులు

వివాదంలో చిక్కుకున్న హీరోయిన్ తమన్నా… ఆ కేసులో మిల్కీ బ్యూటీని విచారించిన అధికారులు

ప్రముఖ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా వివాదంలో చిక్కుకుంది. మనీలాండరింగ్ కేసులో ఆమెను అధికారులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. అస్సాం రాష్ట్ర రాజధాని గౌహతిలో మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు గురువారం హీరోయిన్ తమన్నాను ప్రశ్నించారు.’HPZ టోకెన్’ మొబైల్ యాప్‌ నిర్వాహకులు మోసం చేసినట్లు ఈడీ గుర్తించింది. దీంతో ఈ యాప్ ద్వారా మోసపోయామని భావించిన బాధితులు ‘HPZ టోకెన్’ యాప్ నిర్వాహకుల మీద కేసు చేసినట్టు తెలుస్తోంది.
అయితే ఈ యాప్‌తో తమన్నాకు ఎలాంటి సంబంధం లేనప్పటికీ, విచారణకు హాజరు కావాలని ED అధికారులు ఆమెను కోరారు. ‘HPZ టోకెన్’ యాప్ నిర్వహించిన ఈవెంట్‌కి తమన్నా భాటియా సెలబ్రిటీగా హాజరయ్యారు.అయితే ఇందుకోసం ఆమె నిర్వాహకుల నుంచి డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఎపిసోడ్‌లోనే తమన్నాను ఇడి అధికారులు రహస్యంగా విచారించినట్లు తెలుస్తోంది.

Recent

- Advertisment -spot_img