హీరోయిన్ సంయుక్త మీనన్ SRHకు సపోర్ట్ చేయడంపై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. మలయాళం ఇండస్ట్రీకి చెందిన సంయుక్త, తెలుగు సినిమాల్లో అవకాశాల కోసమే SRHకు సపోర్ట్ చేయడానికి చెపాక్ స్టేడియానికి వెళ్లిందని తమిళ సినిమా పేజీ ట్వీట్ చేసింది. దీనిపై నెటిజెన్లు మండిపడుతున్నారు. కేరళకు IPL టీమ్ లేదని..తనకు ఇష్టమున్న జట్టుకు సపోర్ట్ చేసే హక్కు ఉంటుందని సపోర్ట్ చేస్తున్నారు. మరికొందరు తీవ్రంగా తప్పుబడుతున్నారు.