కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థి ఎవరో వాళ్లకే తెలియదని మాజీ గవర్నర్, బీజేపీ మహిళా నేత తమిళిసై అన్నారు. సంగారెడ్డిలో విశిష్ట సంపర్క అభియాన్ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ప్రజలకు నాకు.. బీఆర్ఎస్ గ్యాప్ సృష్టించిందని విమర్శించారు. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ పథకం ఏర్పాటుకు యత్నించానని.. బీఆర్ఎస్ పార్టీ దీనికి సహకరించలేదని ఆమె అన్నారు. రాహుల్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారో ఆయనకే తెలియదని తమిళిసై విమర్శించారు.