It is learned that Sasikala (Shashikala) was traveling in a car with Anna DMK flag at the time of his release from jail.
There have also been complaints about this. The AIADMK decided to take action without using their party flag.
The party presidium chairman Madhusudhan, joint convener KP Munuswamy, medical lingam, ministers CV Shanmugam, Jayakumar, Tangamani and Velumani lodged a joint complaint with DGP Tripathi on Thursday evening.
జైలు నుంచి విడుదలైన సమయంలో అన్నా డీఎంకే జెండా ఉన్న కారులో శశికళ పయనించిన విషయం తెలిసిందే. దీనిపై ఫిర్యాదులు సైతం వచ్చాయి.
తమ పార్టీ జెండా ఉపయోగించకుండా చర్యలు తీసుకోవాలని అన్నాడీఎంకే నిర్ణయం తీసుకుంది.
ఆ పార్టీ ప్రిసీడియం చైర్మన్ మధుసూధన్, సంయుక్త కన్వీనర్ కేపీ మునుస్వామి, వైద్య లింగం, మంత్రులు సీవీ షణ్ముగం, జయకుమార్, తంగమణి, వేలుమణి గురువారం సాయంత్రం డీజీపీ త్రిపాఠిని కలిసి ఫిర్యాదు చేశారు.
తమ పార్టీకి సంబంధం లేని వ్యక్తి పార్టీ జెండాను ఉపయోగిస్తున్నారని, చర్యలు తీసుకోవాలని వారు డీజీపీని కోరారు.
అన్నాడీఎంకే జెండాలను ఉపయోగించే అర్హత పార్టీ కార్యకర్తలు, నాయకులు మాత్రమే ఉందని, శశికళకు ఏ మాత్రం లేదని వారు అన్నాడీఎంకే నేతలు స్పష్టం చేశారు.
సంబంధం లేని వ్యక్తి జెండాను ఉపయోగించే అర్హత లేదని, అందుకే డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు కేపీ మునుస్వామి మీడియాకు తెలిపారు.
అన్నాడీఎంకే పార్టీ పన్నీరు సెల్వం, పళని స్వామి నేతృత్వంలోని సమన్వయ కమిటీకే చెందుతుందని ఇప్పటికే ఎన్నికల సంఘం స్పష్టం చేసిందని అన్నారు.
కోర్టులు సైతం స్పందించాలన్నారు. ఇప్పటికే జయలలిత సమాధి వద్దకు చిన్నమ్మ వెళ్లకుండా పనుల పేరిట అడ్డుకట్ట వేసిన పాలకులు.. తాజాగా జెండా వాడకానికి చెక్‌పెట్టే పనిలో ఉంది.