HomeరాజకీయాలుTammineni : Congress​ వైఖరి బాధించింది..

Tammineni : Congress​ వైఖరి బాధించింది..

– కమూన్యినిస్టులకు ఆ పార్టీ విలువ ఇవ్వలేదు
– ఎవరితో పొత్తుల్లేవ్.. ఒంటరిగా బరిలోకి దిగుతున్నాం
– సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వెల్లడి
– పోటీ చేయనున్న17 సెగ్మెంట్ల పేర్లను ప్రకటించిన తమ్మినేని

ఇదే నిజం, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి పొత్తు విషయంలో కాంగ్రెస్ పార్టీ వైఖరి తమను బాధించిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులేకుండానే బరిలోకి దిగుతున్నట్లు ఆయన తేల్చి చెప్పారు. మొత్తం 24 స్థానాల్లో పోటీ చేసే యోచనలో ఉన్నట్లు చెప్పారు. తాజాగా సీపీఎం పోటీచేయనున్న 17 సెగ్మెంట్లను ఆయన ప్రకటించారు. మిగతా స్థానాలు, అభ్యర్థుల పేర్లను రెండు మూడు రోజుల్లో ఖరారు చేస్తామన్నారు. భద్రాచలం, అశ్వారావు పేటతోపాటు ఖమ్మం జిల్లాలో 5 స్థానాలు, నల్గొండలో 3, సూర్యాపేట జిల్లాలో 2 సీట్లలో పోటీ చేయనున్నట్లు తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైరా స్థానాన్ని సీపీఎంకు ఇవ్వాలని కాంగ్రెస్‌ను కోరినట్లు చెప్పారు.‘భద్రాచలం, పాలేరు ఇవ్వాలని మొదట అడిగాం. అయితే, వైరా, మిర్యాలగూడ ఇస్తామని కాంగ్రెస్‌ చెప్పింది. ఆ తర్వాత వైరా స్థానం ఇచ్చేందుకు కూడా సిద్ధంగా లేమని చెప్పారు. చర్చల్లో భాగంగా మేం ఎన్నోమెట్లు దిగి వచ్చాం. మిర్యాలగూడతోపాటు హైదరాబాద్‌లో ఒక స్థానం ఇస్తామని ఇప్పుడు కాంగ్రెస్‌ చెబుతోంది. మాతో పొత్తు వద్దని కాంగ్రెస్‌ భావిస్తున్నట్లుంది. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయి. కాంగ్రెస్‌ నేతల వైఖరి సీపీఎంను ఎంతో బాధించింది. కమ్యూనిస్టులకు విలువ ఇవ్వడం లేదు కాబట్టి కాంగ్రెస్‌తో సీసీఎం పొత్తు ఉండదు. పొత్తు లేకుండానే విడిగా పోటీ చేయాలని సీపీఎం భావిస్తోంది’అని తమ్మినేని వీరభద్రం తెలిపారు.

Recent

- Advertisment -spot_img