హైదరాబాద్ః కరోనా పాజిటివ్ రావడంలో అసెంబ్లీ సమావేశాలకు రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు దూరంగా ఉన్నారు. తాజాగా జరిపిన కరోనా టెస్టులో కరోనా నెగిటివ్ రావడంతో ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తిరిగి సోమవారం నుంచి అసెంబ్లీకి హాజరు అయ్యేందుకు హరీష్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 5వ తేదీన మంత్రికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో హోం ఐసోలేషన్ ఉన్న విషయం తెలిసిందే. హరీష్ త్వరగా కరోనా మహమ్మారి నుంచి కోలుకోవాలని కేటీఆర్, కవితతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు సోషల్ మీడియాలో ఆకాంక్షించిన విషయం తెలిసిందే.