Tanzania : ఒక వ్యక్తి కుటుంబం చాలా మంది దృష్టిని ఆకర్షించింది. టాంజానియాకు (Tanzania) చెందిన ఎంజీ ఎర్నెస్టో ముయినుచి కపింగా 20 మంది మహిళలను వివాహం చేసుకున్నాడు అతనికి వందలాది మంది పిల్లలు మరియు వందలాది మంది మనవరాళ్ళు ఉన్నారు. వివరాల్లోకి వెళ్ళితే.. ఒక చిన్న టాంజానియా గ్రామం మధ్యలో, ఎంజీ ఎర్నెస్టో ముయినుచి కపింగా 20 మంది మహిళలను వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం వారిలో 16 మందితో నివసిస్తున్నాడు. మరో నలుగురు భార్యలు మరణించారు. ఈ వ్యక్తి ఇల్లు పెరుగుతున్న జనాభా ఉన్న ఒక గ్రామం లాంటిది. ఈ సాంప్రదాయేతర కుటుంబం 1961లో అతను తన మొదటి భార్యను వివాహం చేసుకున్నప్పుడు ప్రారంభమైంది. దీనికి కారణం అతని తండ్రి కోరిక. “మా వంశం చిన్నది, నువ్వే పెద్ద వంశం చేయి” అని అతని తండ్రి సలహా ఇచ్చాడు.. ఈ క్రమంలోనే అతను 20 మందిని పెళ్లి పెళ్లి చేసుకున్నాడు. ఈ ఆఫ్రికన్ వ్యక్తికి ప్రస్తుతం 16 మంది భార్యలు, 104 మంది పిల్లలు మరియు 144 మంది మనవరాళ్ళు ఉన్నారు.