tarun marriage news: ఇదే నిజం, సినిమా: తరుణ్ పెళ్లిపై గత కొన్ని రోజులుగా రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆయన పెళ్లి అయిపోయిందంటూ కూడా కొన్ని సైట్లు వార్తలు రాశాయి. దీంతో తాజాగా పెళ్లి వార్తలపై తరుణ్ క్లారిటీ ఇచ్చారు. తనకు ఇంకా పెళ్లి కాలేదని చెప్పారు. ఒకవేళ పెళ్లి జరిగితే ఆ విషయం కచ్చితంగా మీడియా ముందు పంచుకుంటానని చెప్పారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పారు. నిజంగానే పెళ్లి ఫిక్స్ అయితే తానే స్వయంగా ఆ శుభవార్తను అందరితో పంచుకుంటానని స్పష్టం చేశారు.