నిన్న( మే 27) జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటు వేయలేదని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తెలిపారు. తనతో పాటు తన కుటుంబంలో ఏడుగురు ఓటు వేయలేకపోయారని చెప్పారు. ‘ఎప్పటిలాగే ఓటు రెన్యువల్ అయిందనుకున్నా. ఈ సారి రెన్యువల్ చేసుకోలేదు. మర్చిపోయా. గతంలో నాలుగుసార్లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేశా’ అని చెప్పారు.