తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉంది. అయితే తెలంగాణలోకి టీడీపీ పార్టీ రీ ఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. తాజా పరిణామాలు బట్టి చూస్తే తెలంగాణ ప్రజలు రాష్ట్ర ప్రభుత్వనికి కొంత వ్యతిరేకంగా ఉన్నారు. అలాగే తెలుగు సినీ ఇండస్ట్రీ కూడా ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉంది. దీంతో ఇదే సరియైన సమయం అని భావించిన ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ రాష్ట్రంలో కూడా టీడీపీ పార్టీని మరోసారి తీసుకురావాలి అని ప్లాన్ చేస్తున్నారు. దీనికి అనుగుణంగానే హైదరాబాద్‌లో ప్రశాంత్‌కిషోర్ మరియు పొలిటికల్ స్ట్రాటజీ కంపెనీ షోటైమ్ రాబిన్ శర్మ లను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరియు మంత్రి నారా లోకేష్ కలిశారు. ఈ క్రమంలోవారు తెలంగాణ టీడీపీ రీ ఎంట్రీ కోసం ప్రణాళికను అందించినట్లు తెలుస్తుంది. అయితే KPHB కాలనీలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు మొదలైంది.