Homeహైదరాబాద్latest Newsప్రమాణ స్వీకారం..ఆరోజేనా?

ప్రమాణ స్వీకారం..ఆరోజేనా?

ఏపీలో కూటమి సునామీ సృష్టించింది. అసెంబ్లీ సీట్లలో దాదాపుగా 161 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఎంపీ సీట్లలో 16 స్థానాల్లో లీడ్‌లో ఉంది. దీంతో ఏపీలో కూటమి విజయం లాంఛనమే. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. పటాకులు కాలుస్తూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రమాణ స్వీకారం ఎప్పుడంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎవరెవరికి ఏయే పదవులు కేటాయిస్తారని టాక్. ఫలితాలను ఎన్నికల సంఘం గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు అందిస్తుంది. ఆ తర్వాత గవర్నర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా మెజార్టీ స్థానాలు సాధించిన పార్టీని కోరుతారు. అమరావతిలో ఈనెల 9న ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది.

Recent

- Advertisment -spot_img