Homeఆంధ్రప్రదేశ్TDP: 'Let's ring the bell' for 5 minutes : 5 నిమిషాల పాటు‘మోత...

TDP: ‘Let’s ring the bell’ for 5 minutes : 5 నిమిషాల పాటు‘మోత మోగిద్దాం’

–నేడు వినూత్న నిరసనకు పిలుపునిచ్చిన టీడీపీ

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ శనివారం వినూత్న నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. చంద్రబాబుకు మద్దతుగా శనివారం రాత్రి 5 నిమిషాల పాటు ప్రజలంతా సీఎం జగన్‌కు వినిపించేలా ఏదో ఒక రకంగా మోత మోగించాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్​లో ట్వీట్‌ చేశారు. నియంత ముందు మొరపెట్టుకుంటే ఫలితం ఉండదని.. అధికార మత్తు వదిలేలా మోత మోగించాల్సిందేనని తెలిపారు. అందువల్ల 5 కోట్ల ఆంధ్రులంతా ఒక్కటిగా ఇంట్లోనో, ఆఫీస్‌లోనో ఇంకెక్కడ ఉన్నా సరే బయటకు వచ్చి గంట లేదా ప్లేట్‌ మీద గరిటెతో కొట్టాలని, రోడ్డుపై వాహనంతో ఉంటే హారన్‌ కొట్టాలని కోరారు. ఎవరు ఏ రూపంలో నిరసన తెలిపినా సంబంధిత వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ‘అక్రమ అరెస్టు చేస్తే ప్రజాగ్రహం ఎలా ఉంటుందో చూపిద్దాం. తప్పుడు కేసులు బనాయిస్తే వెనక్కి తగ్గమని నిరూపిద్దాం. నిలువెత్తు నిజాయితీ రూపం, తెలుగు తేజం చంద్రబాబుకి మద్దతుగా తెలుగు వారంతా ఉన్నారని నిరూపించే తరుణం ఇది. చంద్రబాబు నాయుడుకి మద్దతుగా శనివారం రాత్రి 7 గంటల నుంచి 7.05 నిమిషాలకు ఉన్న చోటే మోత మోగించి ప్రజాశబ్దం వినిపిద్దాం’అని లోకేశ్‌ పిలుపునిచ్చారు.

Recent

- Advertisment -spot_img