Mmmm…TeeeDeeePeee

ఏపీ అసెంబ్లీ ఫలితాల్లో ఎన్డీయే కూటమి విజయం దాాాదాపుగా ఖాయమైంది. 152 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. గత ఎన్నికల్లో వైసీపీ సాధించిన 151 స్థానాల రికార్డును చెరిపేసేలా కనిపిస్తోంది. దీంతో టీడీపీ శ్రేణులు అటు ఏపీలో, ఇటు హైదరాబాద్‌లో సంబరాలు చేసుకుంటున్నారు. సన్నిహితులతో తమ ఆనందాన్ని షేర్ చేసుకుంటున్నారు. ‘నారా చంద్రబాబు నాయుడు అనే నేను’ అనే మాట కోసం వెయిటింగ్ అంటూ పోస్టులు పెడుతున్నారు. ప్రమాణ స్వీకారం ఎప్పుడు? ఎక్కడ? అంటూ జోరుగా చర్చ జరుగుతోంది. కాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు మీడియాతో మాట్లాడనున్నారు. కూటమి అభిమానుల ముఖాలు వెలుగుతుండగా..వైసీపీ ఫ్యాన్స్ ఫేస్‌లు డల్ అయినట్లు కనిపిస్తోంది.

Recent

- Advertisment -spot_img