Homeహైదరాబాద్latest NewsAP Assembly Elections : NDA లోకి TDP

AP Assembly Elections : NDA లోకి TDP

– అమిత్​ షాతో ముగిసిన భేటీ !
– దాదాపు 50 నిమిషాల పాటు చర్చలు
– జనసేన, బీజేపీకి 30 అసెంబ్లీ స్థానాలు
– తొమ్మిది పార్లమెంటు సీట్లు
– కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేయనున్నపవన్​ కల్యాణ్​?

ఇదేనిజం, నేషనల్​ బ్యూరో: తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలోకి చేరబోతున్నది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్​ కల్యాణ్​.. అమిత్​ షా తో భేటీ అయ్యారు. దాదాపు 50 నిమిషాల పాటు వీరి మధ్య చర్చలు జరిగాయి. జనసేన, బీజేపీ కూటమికి 30 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించినట్టు తెలుస్తోంది. ఎన్నిక‌ల్లో సీట్ల స‌ర్దుబాటుపై టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ మ‌ధ్య అవ‌గాహ‌న కుదిరిన‌ట్లు తెలుస్తోంది. అయితే ఎన్డీఏలోకి టీడీపీని బీజేపీ ఆహ్వానించిన‌ట్లు స‌మాచారం. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే ఎన్డీఏ భేటీకి టీడీపీ హాజ‌ర‌య్యే అవ‌కాశం ఉంది. పొత్తులో భాగంగా బీజేపీకి 6 ఎమ్మెల్యే, 5 ఎంపీ సీట్లలో పోటీ చేసే అవకాశం ఉంది. ఇక పవన్​ కల్యాణ్​ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేతో పాటు కాకినాడ ఎంపీ అభ్యర్థిగా కూడా పోటీ చేయబోతున్నట్టు తెలుస్తోంది.

Recent

- Advertisment -spot_img