- స్కూళ్లకు శానిటైజర్లు, మాస్కులు అందజేయాలి
- పిల్లలున్న టీచర్లకు, 50 ఏండ్లు దాటిన వారిరి మినహాయించాలని డిమాండ్
హైదరాబాద్ః ఆగస్టు 27 నుంచి ప్రభుత్వ టీచర్లు విధులకు హాజరు కావాలంటూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల టీచర్లు భయాందోళనలో ఉన్నారు. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత సమయంలో 2020-21 అకడమిక్ ఇయర్ ప్రారంభించడం ఒకింత సంతోషాన్నించిన మరోపక్క అందరూ టీచర్లు విధిగా స్కూళ్లకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చయడం పట్లు టీచర్స్ యూనియన్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంటినుంచే డిజిటల్ పాఠాల రూపకల్పనకు అవకాశం కల్పించాలని విద్యాశాఖ దృష్టికి తీసుకొచ్చినట్లు కూడా పేర్కొంటున్నారు. ప్రస్తుతం ట్రాన్స్ పోర్టు సదుపాయం లేనందున దూర ప్రాంతాల నుంచి వచ్చే టీచర్లకు ఇబ్బందులు ఎదురవుతాయని వాపోతున్నారు. అలాగే సింగిల్ టీచర్ ఉన్న స్కూళ్లలో విద్యావాలంటీర్లకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ప్రతి స్కూల్‌కి ప్రత్యేకంగా శానిటైజర్లు, ఎన్95 మాస్కులను అందజేయాలని, టాయిలెట్స్, పాఠశాలల ఆవరణ ను శుభ్రం చేసేందుకు ఆన్ని పాఠశాలల్లో పారిశుద్ధ్య సిబ్బందని అదనంగా నియమించాలని, కొన్ని రోజుల వరకు పాఠశాల సమయాన్ని ఉ.10 నుండి 12:30 వరకు మాత్రమే కొనసాగించాలని, ప్రతి రోజు 50% టీచర్లు మాత్రమే హాజరయ్యే విధంగా చూడాలని, కోవిడ్ బారిన పడ్డ ఉపాధ్యాయులను, చిన్న పిల్లలు ఉన్న మహిళా టీచర్లను, 50 సం. దాటిన టీచర్లను కరోనా వ్యాధి తగ్గు ముఖం పట్టే వరకు విధుల నుండి మినహాయించాలని టీచర్స్ యూనియన్లు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.