Homeహైదరాబాద్latest Newsటీ20 ప్రపంచకప్ 2024 విశ్వ విజేతగా టీంఇండియా.. ప్రైజ్ మనీ అన్నీ కోట్లా? మరి మిగిలిన...

టీ20 ప్రపంచకప్ 2024 విశ్వ విజేతగా టీంఇండియా.. ప్రైజ్ మనీ అన్నీ కోట్లా? మరి మిగిలిన జట్ల పరిస్థితేంటి..?

టీ20 వరల్డ్ కప్-2024 విజేతగా భారత్ నిలిచింది. శనివారం అత్యంత ఉత్కంఠగా జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై 7 పరుగుల తేడాతో భారత్ గెలిచింది. 13 ఏళ్ల ప్రపంచకప్, 11 ఏళ్ల ఐసీసీ టోర్నీ నిరీక్షణకు తెరపడింది. కాస్త ఆలస్యమైనా చరిత్రలో నిలిచేలా తుదిపోరులో టీమిండియా విజయం సాధించింది. గెలుపు ఆశలు లేని స్థితి నుంచి అద్భుతంగా పోరాడింది. నరాలు తెగే ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఈ ట్రోఫీతో టీమ్ ఇండియా ICC నుండి 2.45 మిలియన్ డాలర్లు అంటే దాదాపు 20.42 కోట్ల బహుమతిని అందుకుంది. ఇది కాకుండా,భారత జట్టు ఒక్కో విజయానికి విడిగా రూ.26 లక్షలు అందుకున్నారు. ఇవన్నీ కలిపితే భారత జట్టు ఈ టోర్నీ ద్వారా రూ.22.76 కోట్లు పొందారు. తొలిసారి ఫైనల్ చేరి రన్నరప్‌గా నిలిచిన దక్షిణాఫ్రికా 1.28 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 10.67 కోట్లు) అందుకుంది. ఇది ఛాంపియన్ జట్టు ప్రైజ్ మనీలో సగం, ఇది కాకుండా 8 మ్యాచ్‌లు గెలిచినందుకు విడిగా సుమారు 2.07 కోట్ల రూపాయలు అందుకుంది. అదేవిధంగా సెమీఫైనల్‌లో ఓడిన జట్లకు ఐసీసీ రూ.6.56 కోట్ల ప్రైజ్ మనీని అందుకుంటాయి. దీని ప్రకారం సెమీఫైనల్లో ఓడిన ఆఫ్ఘనిస్థాన్, ఇంగ్లండ్ జట్లకు రూ.6.56 కోట్లు లభించాయి. సూపర్-8 రౌండ్ నుంచి నిష్క్రమించిన ఒక్కో జట్టుకు 3.18 కోట్లు లభిస్తాయి. ఈ సూపర్-8 రౌండ్ నుంచి నిష్క్రమించిన జట్లలో వెస్టిండీస్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ మరియు USA ఉన్నాయి. గ్రూప్ స్టేజి దాటిన జట్టును ఖాళీ చేతులతో వెళ్లేందుకు ఐసీసీ అనుమతించలేదు. అంటే 9 నుంచి 12వ ర్యాంక్‌లో ఉన్న జట్లకు ఐసీసీ ఒక్కో మ్యాచ్ విజయంపై రూ.2.06 కోట్లు లభిస్తాయి. ఇది కాకుండా ఈ జట్లకు ఒక్కో విజయానికి విడివిడిగా రూ.26 లక్షలు లభిస్తాయి.

Recent

- Advertisment -spot_img