బెరిల్ హరికేన్ ముప్పుతో ద్వీప దేశం బార్బడోస్‌లో చిక్కుకుపోయిన భారత క్రికెట్ జట్టు ఎట్టకేలకు స్వదేశానికి బయల్దేరింది. బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో రోహిత్ సేత భారత్‌కు పయనమైంది. వీరు గురువారం ఉదయానికి ఢిల్లీ చేరుకోనున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ కార్యదర్శి జై షా సహా టీమిండియా క్రికెటర్లు, వారి కుటుంబసభ్యులు అంతా కలిపి 70 మంది వరకు ఉన్నట్లు తెలుస్తుంది.
అయితే వెస్టిండీస్ దీవుల్లోని బార్బొడాస్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్ విజయం సాధించి.. 17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్‌ను దక్కించుకుంది. అద్భుత ఆటతీరుతో టీ20 ప్రపంచకప్ సాధించిన టీమిండియా సభ్యులు మరికొద్ది గంటల్లో స్వదేశానికి తిరిగి రాబోతున్నారు. ఈ నేపథ్యంలో BCCI టీ20 ప్రపంచకప్ వీడియోను షేర్ చేసి.. ‘అది ఇంటికి వచ్చేస్తోంది’ అని కామెంట్ చేసింది.