మూడో టీ20లో భాగంగా నేడు హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో టీమిండియా, బంగ్లాదేశ్ జట్టుల మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో టీమిండియా ఇప్పటికే 2-0తో సిరీస్ గెలిచింది. దాంతో ఇవాళ్టి మూడో టీ20 నామమాత్రంగా మారింది.
టీమిండియా జట్టులో సంజు శాంసన్(వికెట్‌కీపర్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్ ఉన్నారు.
బంగ్లాదేశ్ జట్టులో పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, లిట్టన్ దాస్(వికెట్‌కీపర్), నజ్ముల్ హొస్సేన్ శాంటో(కెప్టెన్), తంజిద్ హసన్, తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, మెహిదీ హసన్ మిరాజ్, తస్కిన్ అహ్మద్, రిషద్ హొస్సేన్, ముస్తాఫిజుర్ రహ్మాన్, తంజిమ్ హసన్ సకీబ్ ఉన్నారు.