Homeహైదరాబాద్latest News“హరిహర వీరమల్లు” నుంచి టీజర్ అప్డేట్..!

“హరిహర వీరమల్లు” నుంచి టీజర్ అప్డేట్..!

దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ “హరిహర వీరమల్లు”. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి కావాల్సి ఉంది. అయితే పవన్ కళ్యాణ్ కమిట్ అయిన రాజకీయ అజెండా కారణం గా వాయిదా పడుతూ వస్తోంది. ఈ సినిమా పై అప్డేట్స్ మాత్రం మేకర్స్ అందిస్తున్నారు. అయితే ముందుగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేస్తారని చాలా వార్తలు వచ్చాయి. అయితే ఇపుడు “హరిహర వీరమల్లు” టీజర్ ని మూవీ యూనిట్ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. ఈ మే 2న ఉదయం 9 గంటలకి వీరమల్లు అవైటెడ్ ట్రీట్ వస్తున్నట్టుగా ఇప్పుడు సరికొత్త పాన్ ఇండియా పోస్టర్ లతో రివీల్ చేశారు. మొత్తానికి చాలా కాలం తర్వాత పవన్ అభిమానులకు గ్రాండ్ ట్రీట్ రాబోతోందనే చెప్పాలి. ఇప్పటికే వచ్చిన గ్లింప్స్,పవర్ గ్లాన్స్ లకి అదిరే రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ ట్రీట్ ఎలా ఉంటుందో చూడాలి. ఈ సినిమాలో బాబీ డియోల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఎఎమ్ రత్నం నిర్మిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img