Homeవిద్య & ఉద్యోగంఆన్‌లైన్‌లో ఉచిత శిక్ష‌ణ‌.. 100 శాతం ఉపాధి

ఆన్‌లైన్‌లో ఉచిత శిక్ష‌ణ‌.. 100 శాతం ఉపాధి

దరఖాస్తులు ఆహ్వానిస్తున్న‌ టెక్ మహీంద్రా ఫౌండేషన్
హైదరాబాద్: నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే సంకల్పంతో టెక్‌ మహీంద్రా ఫౌండేషన్‌, అప్సా స్వచ్ఛంద సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత కంప్యూటర్‌, కమ్యూనికేటివ్‌ స్కిల్స్‌, ఇంగ్లిష్‌ టైప్‌రైటింగ్‌, ఇంటర్నెట్‌ కాన్సెప్ట్‌, కస్టమర్‌ రిలేషన్‌షిప్‌ కోర్సుల్లో శిక్షణ అందించడంతోపాటు 100 శాతం ఉపాధి అవకాశాలను టెక్‌ మహీంద్రా ఫౌండేషన్ మేనేజర్‌ మౌలా తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులై, ఇంటర్‌, డిగ్రీ పాస్‌ లేదా ఫెయిల్‌ అయిన 18 నుంచి 27 ఏళ్ల లోపు యువతీ, యువకులు అర్హులని తెలిపారు. అభ్యర్థులు న్యూభోలక్‌పూర్‌లోని ఎవర్‌గ్రీన్‌ సామాజిక భవనంలోని అప్సా టెక్‌ మహీంద్రా ఫౌండేషన్‌ స్మార్ట్‌ వృత్తి శిక్షణ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వివరాలకు 7075461137, 8639821605 ఫోన్‌ నెంబర్లలో సంప్రదించాలని తెలిపారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img