Teenmar Mallanna : కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) , చింతపండు నవీన్ కుమార్‌కు కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. బీసీ సమస్యలపై మల్లన్న పార్టీ పరిధి దాటి వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. దీనిపై వివరణ ఇవ్వాలని కోరుతూ పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అయితే దీనిపై తీన్మార్ మల్లన్న స్పందించాడు. నాకు నోటీసులు ఇవ్వడానికి మీరెవరు అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ మీ అయ్య జాగీరా అని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ మాది నన్ను బెదిరించాలని చూస్తే నడవదు అని అన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు కులగణన సర్వే బాలేదని చెప్పకుండా, పారదర్శకంగా ఉందని భజన చేస్తున్నారు అని అన్నారు. ఇది సమగ్ర కుల సర్వే కాదు.. అగ్రకుల సర్వే అని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు.