సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో టాలివుడ్లో అడుగుపెట్టిన బ్యూటీ తేజస్వీ మదివాడ. టాలివుడ్లో అడపాదడపా సినిమాలు చేస్తున్నా ఈ అమ్మడుకు సరైన అవకాశాలు తగలడం లేదు. సంచలన దర్శకుడు రామ్గోపాల్ వర్మ తీసిన ఐస్క్రీం వంటి సినిమాలతో గ్లామర్ డోస్ పెంచి రెచ్చిపోయినా తరువాత చెప్పుకోదగ్గ అవకాశాలు తన వైపు చూడలేదు. చిన్నా చితకా సినిమాలు చేసినా ఆ సినిమాలు వచ్చి పోయింది కూడా చాలా మందికి తెలియదు. తరువాత బిగ్బాస్ షోలో పాల్గొన్న తేజస్వీ తరువాత మంచి అవకాశాలే వస్తాయనుకుంది. కానీ బిగ్బాస్ షోలో పాల్గొన్న అందరికీ వారు అనుకున్నట్లు పాపులారిటీ వచ్చిందే తప్ప సినిమా అవకాశాలు మాత్రం రాలేదు. ఇక తన పాపులారిటీని ఎలాగైనా పెంచుకుని సినీ అవకాశాలు అందిపుచ్చుకునేందుకు తేజస్వీ తన సోషల్ మీడియా వేధికగా తన గ్లామర్ డోస్ పెంచిన ఫోటోషూట్ చిత్రాలను పంచుకుంటూ యువతను ఆకర్షిస్తూ అభిమానులను పెంచుకుంటుంది. ఈ ఫోటోషూట్ ప్లాన్ ఎంతవరకు పనికొస్తుందో చూడాలి మరి.

