హైదరాబాద్ : అసెంబ్లీ అంటే అల్లర్లు, దూషణాలు, గందరగోళాలు, తిట్లు, శాపనార్థాలు కాదు. పనికిమాలిన నిందలు, అసహనం ప్రదర్శించేందుకు అసెంబ్లీ వేదిక కారాదు అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ర్ట ప్రజలకు సంబంధించిన అన్ని అంశాలపై అసెంబ్లీ సమావేశాల్లో సమగ్రమైన చర్చ జరగాలని ప్రభుత్వం కోరుకుంటోందన్నారు. 7న ప్రారంభం కాబోయే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రులు, చీఫ్ విప్‌లు, విప్‌లతో ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ సమావేశమై చర్చించారు. ఎన్ని రోజులైనా సరే, అన్ని రాజకీయ పక్షాలు ప్రతిపాదించిన అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అన్ని అంశాలపై సంపూర్ణమైన సమాచారంతో మంత్రులు సిద్ధం కావాలని సీఎం ఆదేశించారు. అధికార పక్ష సభ్యులు కూడా ప్రజలకు సంబంధించిన అంశాలను సభలో ప్రస్తావించాలని ఎమ్మెల్యేలకు సీఎం సూచించారు. సభ్యులు అడిగే ప్రతి అంశానికి సంబంధించిన వివరాలను ప్రభుత్వం వెల్లడిస్తుందని కేసీఆర్ స్పష్టం చేశారు.
7న టీఆర్ఎస్ఎల్పీ సమావేశం
అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ఈ నెల 7న టీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరగనుంది. 7న సాయత్రం 5 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పార్టీ ఆహ్వానించింది. దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డికి మృతికి టీఆర్ఎస్ఎల్పీ సంతాపం తెలపనుంది.
అల్లర్లకు అసెంబ్లీ వేదిక కారాదు: కేసీఆర్
RELATED ARTICLES