Homeతెలంగాణప్ర‌త్యేక రాష్ట్రంలో నాకు ఉద్యోగం వ‌స్తుంది అ‌మ్మ‌... ఉద్యమకారుడి ఆత్మహత్య

ప్ర‌త్యేక రాష్ట్రంలో నాకు ఉద్యోగం వ‌స్తుంది అ‌మ్మ‌… ఉద్యమకారుడి ఆత్మహత్య

తెలంగాణ వచ్చినా తన బతుకు మారలేదని, ఉద్యోగం రాలేదని ఆవేదనతో గజ్వేల్‌ మండ లం అనంతరావుపల్లి గ్రామానికి చెందిన కొప్పు రాజు (28) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం లో భాగంగా రాజు.. ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా జరిగిన పోరాటాల్లో పాల్గొన్నాడు.

తెలంగాణ వస్తే తమకు ఉద్యోగాలు వస్తాయని, బతుకులు మారుతాయని ఆశించాడు.

అయితే తాను అనుకున్న మార్పులేవీ జరగకపోవడంతో నిరాశకు గురై, మనస్తాపం చెందిన రాజు.. గురువారం సాయంత్రం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొప్పు సత్తయ్య పెద్ద కుమారుడు రాజు(28) బీఈడీ పూర్తి చేశాడు.

ఉస్మానియ విశ్వవిద్యాలయంలో చదివిన సమయంలో తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. కొన్నాళ్ల పాటు తిరుమలగిరిలోని ఓ కారు షోరూంలో పని చేశాడు.

ఏడాది కిందట స్వగ్రామానికి వచ్చి ఉపాధి కూలీగా పని చేస్తూ తల్లిదండ్రులకు ఆసరాగా ఉంటున్నాడు.

ఈ క్రమంలో రెండు నెలల కిందట పని ప్రదేశంలో కాలికి పాలుగు తగలగా గాయమైంది. సరైన వైద్యం చేయించుకోకపోవడంతో విషమించింది.

ఇటు ఆరోగ్యం బాగలేకపోవడం, తల్లిదండ్రులకు భారం అయ్యానని మనో వేదసకు గురయ్యాడు.

గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తల్లి చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

ప్రత్యేక రాష్ట్రం వచ్చాక తనకు ఉద్యోగం వస్తుందని చెప్పేవాడని, ఇప్పుడు తనువు చాలించి కానరాని లోకానికి వెళ్లాడని కుటుంబీకులు రోదించారు.

KoppuRaju (28) of Gajwel Mandalam Anantharavupalli village committed suicide by hanging himself after realizing that he did not change his life and did not get a job when he came to Telangana.

As part of the Telangana Movement, Raju participated in the struggles held at OsmaniaUniversity.

He hopes that if Telangana comes, jobs will come to them and the survivors will change.

However, the frustrated raju committed suicide by hanging himself at home on Thursday evening.

Recent

- Advertisment -spot_img