తెలంగాణ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్‌గా కొనసాగాయి. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. శాసనసభలో ‘భూభారతి’ బిల్లును పొంగులేటి ప్రవేశపెట్టారు. సభ్యులు మద్యం తాగి సభకు వస్తున్నారని ఎమ్మెల్యే హరీశ్ రావు కామెంట్స్ చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. కాగా సభను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మధ్యహ్నం 3గంటలకు వాయిదా వేశారు.