– ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసిన సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు
– హాజరుకాని బీజేపీ ఎమ్మెల్యేలు
– రెగ్యులర్ స్పీకర్‌ను ఎన్నుకున్న తర్వాతే ప్రమాణం చేస్తామని వెల్లడి
ఇదే నిజం, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎంకు చెందిన చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణం చేయించారు. ముందుగా సీఎం రేవంత్‌రెడ్డి, తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఆ తర్వాత వరుసగా మంత్రులు ప్రమాణం చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌కు సర్జరీ దృష్ట్యా ప్రమాణ స్వీకారానికి కేటీఆర్ రాలేదు. ప్రమాణ స్వీకారానికి తనకు మరో రోజు సమయం ఇవ్వాలని శాసనసభ సెక్రటరీని ఆయన కోరారు. మరోవైపు, శాసనసభ సమావేశాలకు బీజేపీ ఎమ్మెల్యేలు గైర్హాజరు అయ్యారు. సీనియర్ ఎమ్మెల్యేలను కాదని ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్‌ను చేశారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. ప్రొటెం స్పీకర్ సమక్షంలో బీజేపీ ఎమ్మెల్యేలు ఇవాళ ప్రమాణం చేయరని తేల్చిచెప్పారు. రెగ్యులర్ స్పీకర్ ఎన్నిక తరువాతే బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణం చేస్తారన్నారు