నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అలాగే తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 25న ఉభయ సభల్లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. . ఈ సమావేశాల్లో పూర్తిస్థాయి బడ్జెట్ తో పాటు స్కిల్ వర్సిటీ బిల్లుకు ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తుంది. జాబ్ క్యాలెండర్ ప్రకటన, రైతు భరోసా విధివిధానాలు, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు, సంక్షేమ పథకాల్లో అక్రమంగా లబ్ధిపొందిన వారి నుంచి రికవరీ, తెలంగాణ తల్లి విగ్రహం, రాష్ట్ర చిహ్నం, విద్య, వ్యవసాయ కమిషన్ల ఏర్పాటు తదితర అంశాలపై చర్చించి తీర్మానం చేయనున్నట్లు తెలుస్తుంది.