Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. నేడు ఉదయం 10 గంటలకి తెలంగాణ అసెంబ్లీ ప్రారంభం అయ్యింది. సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాగ్ రిపోర్ట్ పెట్టనున్నారు. సీఎం రేవంత్ డీలిమిటేషన్‌పై ప్రభుత్వ తీర్మానం ప్రవేశ పెట్టనున్నారు. అలాగే నేడు ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలపనుంది. డీలిమిటేషన్, కాగ్ రిపోర్ట్‌ను సభలో ప్రవేశపెట్టనుండగా అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగే ఛాన్స్ ఉంది.