Telangana Bhu Bharati: తెలంగాణ భూ భారతి చట్టం 2025, రాష్ట్రంలో భూ రికార్డుల నిర్వహణను ఆధునీకరించడానికి మరియు పారదర్శకతను పెంచడానికి రూపొందిన కీలకమైన చట్టం. అంబేద్కర్ జయంతి సందర్భంగా, రేపు (ఏప్రిల్ 14, 2025) నుంచి తెలంగాణ భూ భారతి (రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్స్) యాక్ట్, 2025 అమలులోకి రానుంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ కొత్త చట్టాన్ని శిల్ప కళావేదిక వేదికగా ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా భూ భారతి చట్టం నిబంధనలతో అధునాతన ఫీచర్లు కలిగిన కొత్త డిజిటల్ పోర్టల్‌ను కూడా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి రంగారెడ్డి కలెక్టర్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్, శిల్పారామం స్పెషల్ ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారు.