Telangana BJP: తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడి ఎంపిక ఎప్పుడనే దానిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పెదవి విప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే రాష్ట్రంలో నూతన అధ్యక్షుడి ఎంపిక ఉంటుందని ఆయన తెలిపారు. తమ పార్టీకి బీఆర్ఎస్ తో కలవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య అంతర్గత సంబంధం ఉందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ మూడు స్థానాల్లో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు హామీల అమలులో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు.