Homeఫ్లాష్ ఫ్లాష్గుడ్ న్యూస్.. అగ్గువకే నాణ్యమైన గవర్నమెంట్ మటన్

గుడ్ న్యూస్.. అగ్గువకే నాణ్యమైన గవర్నమెంట్ మటన్

మార్కెట్‌లో మటన్ ధరలు మండిపోతున్నాయి. నాణ్యతను బట్టి రూ.700 నుంచి రూ.1000 వరకు పలుకుతున్నాయి.

మేక మాంసం ధర ఇంత భారీగా పలుకుతుండడంతో సామాన్యుడికి అందకుండాపోతోంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

తెలంగాణ ప్రభుత్వ బ్రాండ్‌తో నాణ్యమైన మాంసం విక్రయాలను త్వరలో ప్రారంభిస్తామని తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమల అభివృద్ధిశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ వెల్లడించారు.

శుక్రవారం మాసాబ్‌ట్యాంక్‌లోని పశుసంవర్ధకశాఖ కార్యాలయంలో అధికారులు, పశువైద్యుల నూతన సంవత్సర డైరీని, క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో క్షీర, నీలి, గులాబీ విప్లవాలు వచ్చాయని చెప్పారు.

గొర్రెల పంపిణీ, చేప పిల్లల పంపిణీతో పెద్ద ఎత్తున గొర్రెలు, మత్స్య సంపద పెరిగిందని చెప్పారు మంత్రి తలసాని.

మాంసం ఉత్పత్తి భారీగా పెరిగిందని పేర్కొన్నారు. అపారమైన సంపదను సృష్టించి పేదలకు పంచాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు.

ఈ సమావేశంలో పశుసంవర్ధకశాఖ కార్యదర్శి అనితారాజేంద్ర, టీఎస్‌ఎల్‌డీఏ సీఈవో మంజువాణి, పశుసంవర్ధకశాఖ ఎండీ డాక్టర్‌ వీ లక్ష్మారెడ్డి, అడిషనల్‌ డైరెక్టర్‌ రాంచందర్‌, ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బాబు బేరి, వీఏఎస్‌ల సంఘం అధ్యక్షుడు దేవేందర్‌ పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img