– నిరూపిస్తే నామినేషన్ విత్ డ్రా చేసుకుంటా
– సాయంత్రం 3 గంటల వరకు టైమ్ ఉంది
– సీఎం కేసీఆర్ కామారెడ్డి చౌరస్తాకు వస్తే చర్చిస్తా
– పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
ఇదేనిజం, కామారెడ్డి: తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ ఇస్తున్నట్టు నిరూపిస్తే తాను కొడంగల్, కామారెడ్డి రెండు చోట్ల నామినేషన్ విత్ డ్రా చేసుకుంటానని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. సీఎం కేసీఆర్ కామారెడ్డి చౌరస్తాకు లాగ్ బుక్ తో రావాలని సూచించారు. సాయంత్రం మూడు గంటల వరకు టైమ్ ఉందన్నారు. బుధవారం కామారెడ్డిలో నిర్వహించిన కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో రేవంత్ మాట్లాడారు. కరెంటుపై చర్చకు తాను సిద్ధమని లాగ్ బుక్‌లతో కీసీఆర్ రావాలంటూ ఛాలెంజ్ విసిరారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కచ్చితంగా పూర్తి స్థాయిలో 24 గంటల పాటు కరెంటు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. జోరుగా నియోజకవర్గాలను చుట్టేస్తున్న బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌తోపాటు మిగతా బడా నేతలంతా కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తున్నారు. ప్రతి సభలో కరెంటు కావాలా కాంగ్రెస్ కావాలా అంటూ ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నారు. గతంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితోపాటు కర్ణాటకలో కాంగ్రెస్ నేతలు చేసిన కామెంట్స్‌ను ఉదాహరణగా చూపిస్తున్నారు.