తెలంగాణ కేబినెట్ భేటీ వాయిపడింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 23న జరగాల్సి ఉండగా.. 26వ తేదీకి వాయిదా వేసినట్లు CS శాంతికుమారి వెల్లడించారు. 26న సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ అధ్యక్షతన సచివాలయంలో సమావేశం జరుగుతుందని పేర్కొన్నారు. ఈభేటీలో అసెంబ్లీ సమావేశాలతో పాటు హైడ్రా, రెవెన్యూ చట్టం, మూసీ బాధితుల అంశం, వరద నష్టం, రైతు భరోసా తదితర అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. మీటింగ్ వాయిదా పడడానికి కారణాలు తెలియరాలేదు.