రైతు భరోసాపై తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ భేటీ జరిగింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన సచివాలయంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశం సుదీర్ఘంగా రెండున్నర గంటల పాటు జరిగింది. అయినా సరే రైతు భరోసాపై ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో మళ్లీ సమావేశం కావాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది.