Telangana Congress: తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు అధిష్టానం చెప్పినట్టు సమాచారం.. రాష్ట్రంలో నలుగురు కొత్త మంత్రులను నియమించేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ రేసులో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్/ చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్, మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి, నల్గొండ నుంచి బాలు నాయక్ / కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఉన్నట్లు సమాచారం. అటు మైనార్టీ కోటాలో బెర్త్ కోసం పోటీ నెలకొంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.