Homeతెలంగాణఎన్నికల నియమావళి ఉల్లంఘపై ఏపీ సీఎం జగన్‌కు తెలంగాణ కోర్టు సమన్లు

ఎన్నికల నియమావళి ఉల్లంఘపై ఏపీ సీఎం జగన్‌కు తెలంగాణ కోర్టు సమన్లు

The Public Representative Court in Nampally, Hyderabad has issued summons to Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy.

The court recently issued summons in a case filed against him for violating the code of conduct by holding a rally on National Highway-65 without permission as part of the 2014 election campaign.

హైదరాబాద్ నాంపల్లిలోని ప్రజా ప్రతినిధుల కోర్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి సమన్లు జారీ చేసింది.

2014 ఎన్నికల ప్రచారంలో భాగంగా జాతీయ రహదారి-65పై అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ దాఖలైన కేసులో కోర్టు తాజాగా సమన్లు జారీ చేసింది.

అప్పట్లో జగన్‌పై కోదాడ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో పోలీసులు చార్జ్‌షీట్ దాఖలు చేశారు.

ఈ కేసులో జగన్ ఏ1 నిందితుడు కాగా, ఏ2, ఏ3 నిందితులుగా ఉన్న వారిపై అక్కడి కోర్టు కేసులు కొట్టివేసింది.

ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న జగన్ ఇప్పటి వరకు విచారణకు హాజరు కాకపోవడంతో తాజాగా సమన్లు జారీ చేసింది. ఈ నెల 12న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది.

Recent

- Advertisment -spot_img