Telangana Cyber Operation : తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) గుజరాత్‌లో నిర్వహించిన ఒక ప్రత్యేక సైబర్ ఆపరేషన్‌లో 20 మంది సైబర్ నేరస్థులను అరెస్టు చేసింది. ఈ ఆపరేషన్ సైబర్ మోసాలు, ఆర్థిక నేరాలు మరియు ఇతర డిజిటల్ మోసాలను అరికట్టే లక్ష్యంతో జరిగింది. అరెస్టు చేయబడిన వ్యక్తులు తెలంగాణలో 60 కేసులు.. అలాగే దేశవ్యాప్తంగా 515 సైబర్ నేరాలకు సంబంధించిన కేసుల్లో పాల్గొన్నారు. ఈ ఆపరేషన్‌లో 20 మొబైల్ ఫోన్‌లు, 28 సిమ్ కార్డులు, 4 ఏటీఎం కార్డులు, 5 చెక్ బుక్స్, 2 రబ్బరు స్టాంపులు, ఇతర డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. నిందితులను ప్రైవేట్ ఉద్యోగులు, వ్యాపారులు మరియు డిసిబి బ్యాంక్ వాపి బ్రాంచ్ రిలేషన్షిప్ మేనేజర్‌గా గుర్తించారు.