Homeహైదరాబాద్latest Newsఇండస్ట్రీ లో తెలంగాణ డైరెక్టర్లదే పై చేయి.. సత్తా చాటుతున్న ఈ స్టార్ డైరక్టర్లు..!

ఇండస్ట్రీ లో తెలంగాణ డైరెక్టర్లదే పై చేయి.. సత్తా చాటుతున్న ఈ స్టార్ డైరక్టర్లు..!

గతంలో టాలీవుడ్ అంటే ఆంధ్రప్రదేశ్ అనే భావన ఉండేది. కానీ 2014లో ఆంధ్ర, తెలంగాణ విడిపోయింది. అయితే ప్రస్తుతం సినీ పరిశ్రమ తెలంగాణలోనే ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఉంది. ఇక పాయింట్ లోకి వస్తే, టాలీవుడ్ లో రాణించిన దర్శకులు, కమెడియన్లు, స్టార్ హీరోల్లో ఎక్కువ మంది ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారే అని తెలిసిందే. తెలుగు చిత్ర పరిశ్రమలో రాణించిన వారిలో అత్యధికులు గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వారేనని పలువురు అంటున్నారు. అయితే గత కొన్నేళ్లుగా తెలంగాణ ప్రజలు కూడా రాణిస్తున్నారు. అలాగే ప్రస్తుతం ఉన్న టాప్ డైరెక్టర్లలో 10 మంది తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు కావడం విశేషం.
ముఖ్యంగా చెప్పాలంటే వరంగల్ వాసి సందీప్ రెడ్డి వంగా, మహబూబ్ నగర్ బిడ్డ నాగ్ అశ్విన్ లు వాళ్ల డైరెక్షన్ తో ప్రత్యేక ముద్ర వేశారు. సందీప్ రెడ్డి వంగా ‘అర్జున్ రెడ్డి’ తో డైరెక్షన్ లో తన మార్క్ చూపించాడు. ఇప్పుడు బాలీవుడ్లో కూడా రాణిస్తున్నాడు. అలాగే ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ ‘మహానటి’ వంటి చిత్రాలతో స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన నాగ్ అశ్విన్ కూడా టాలీవుడ్ లో సత్తాచాటాడు. ప్రస్తుతం ప్రభాస్ తో పాన్ ఇండియా మూవీ చేసేస్తున్నాడు. ఈ డైరెక్టర్లకు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ లేకుండా ఎదగడం మరో విశేషం. వీరికి ఇండస్ట్రీ లో గాడ్ ఫాదర్లు లేరు గైడ్ లు లేరు వారి కొత్త టాలెంట్ గుర్తింపు తెచ్చుకున్నారు. వీరికి ఫ్యామిలీ హిస్టరీ లేదు, ఎలాంటి సినిమా నేపథ్యం లేదు. కేవలం సొంత తపన, కసి, స్వయకృషి తో ఇప్పుడు వీళ్ళు పాన్ ఇండియా డైరెక్టర్ లుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం పేరుమోసిన ఆంధ్ర డైరెక్టర్స్ ని వెనక్కి నెట్టారు. తెలంగాణ అంటే ఇదేరా అని ఈ ఇద్దరు అని నిరూపించారు.

Recent

- Advertisment -spot_img